బంగారం స్మగ్లింగ్ తో సంబంధం లేదాహన్తున్న స్వప్న సురేష్

- July 09, 2020 , by Maagulf
బంగారం స్మగ్లింగ్ తో సంబంధం లేదాహన్తున్న స్వప్న సురేష్

కేరళ:కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉన్నదనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.శివశంకర్‌ ను విధుల నుంచి తొలగించారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగిని స్వప్న సురేష్ పై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించింది. బంగారం అక్రమ రవాణాకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నది. బుధవారం నాడు రాత్రి కేరళ హైకోర్టులో ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద లభించిన బంగారు అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో నిందితురాలు స్వాప్నా ప్రభా సురేష్ కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ లో ఆమె నిర్దోషి అని , తాను ఎటువంటి  నేరాలకు పాల్పడలేదని చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కాన్సులేట్ జనరల్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసి, స్టేట్ ఐటి డిపార్టుమెంటు పరిధిలోని స్పేస్ పార్క్ ప్రాజెక్టు లోనిప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి‌గా చేరానని ఆమె తెలిపారు. యుఎఇ ప్రస్తుత కాన్సులేట్ జనరల్ రషీద్ ఖ్మిస్ అల్ షీమెల్లి జూన్ 30 న చేరుకున్న సరుకు ను  గురించి కస్టమ్స్ అధికారులతో తనిఖీ చేయాలని ఆమె ఆదేశించినట్లు ఆమె బెయిల్ పిటిషన్లో ఆరోపించారు. జూలై 1 న కాన్సులేట్ జనరల్ ఆమెను కస్టమ్స్ ఆఫీసర్, కార్గో కాంప్లెక్స్ తిరువనంతపురాన్ని సంప్రదించమని ఆదేశించారు.

తన అధికారిక విధులను నిర్వర్తించడంలో భాగంగా, ఆమె కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను పిలిచి, దౌత్య సరుకు గురించిన విష్గాయాల్ని ధృవీకరించింది. ఎయిర్ కార్గో కాంప్లెక్స్ అసిస్టెంట్ కమిషనర్ విజ్ఞప్తి మేరకు, కాన్సుల్ జనరల్ ఇన్ఛార్జి కార్గో కాంప్లెక్స్‌కు వెళ్లి, సరుకు తనకు చెందినదని కస్టమ్స్ అథారిటీ ముందు అంగీకరించారు. జూలై 5 న కాన్సుల్ జనరల్‌తో పాటు ఢిల్లీ హైకమిషనర్ సీనియర్ అధికారుల సమక్షంలో ఈ సరుకును తెరిచారు. 

అందులో దాచిన 30 కిలోల బంగారం కనుగొన్నారు. బంగారం అక్రమ రవాణాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదా ప్రమేయం లేదు. ఆమె తన అధికారిక పనిలో భాగంగా కాన్సులేట్ జనరల్ ఇచ్చిన సూచనల మేరకు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ కస్టమ్స్ ను ఫోన్ ద్వారా మాత్రమే సంప్రదించానని,  ఈ కేసులో తనను ఇరికించే అవకాశం ఉందని ఆమెపేర్కొన్నది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను ఆదేశించాలని స్వప్న సురేష్ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com