భారత్ నుంచి యూఏఈ ఛార్టెడ్ విమానాల బుకింగ్స్ షురూ..ప్రయాణ తేదీలపై మాత్రం గందరగోళం

- July 09, 2020 , by Maagulf
భారత్ నుంచి యూఏఈ ఛార్టెడ్ విమానాల బుకింగ్స్ షురూ..ప్రయాణ తేదీలపై మాత్రం గందరగోళం

వివిధ కారణాలతో సొంత దేశానికి చేరుకున్న ప్రవాస భారతీయులు తిరిగి యూఏఈ వెళ్లేందుకు వేలాదిగా ఎదురుచూస్తున్నారు. యూఏఈ వెళ్లే వారి కోసం ఇండియాలోని పలు నగరాల నుంచి భారత్, యూఏఈ ట్రావెల్ ఎజెన్సీ సంస్థలు ఇప్పటికే పలు ఛార్టెడ్ విమనాలకు టికెట్ బుకింగ్స్ ను కూడా ప్రారంభించాయి. కానీ, ప్రత్యేక విమాన అనుమతులపై ఇంకా అనిశ్చితి నెలకొని ఉంది. ఇప్పటివరకు అటు భారత్ నుంచిగానీ, ఇటు యూఏఈ నుంచిగానీ ప్రత్యేక విమానాలకు ఇంకా అనుమతులే రాలేదు. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకొని ప్రయాణానికి సిద్ధమైన వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిన ట్రావెల్ ఏజెన్సీలు టికెట్ల బుకింగ్ ప్రారంభించినా ప్రభుత్వ అనుమతిపై సందిగ్థత నెలకొటంతో..ప్రయాణ షెడ్యూల్ ను మాత్రం ఇంకా ప్రకటించలేకపోతున్నారు. అక్బర్ ట్రావెల్స్ ఆఫ్ ఇండియా తమ ఛార్టెడ్ విమాన సర్వీసులకు సంబంధించిన ప్రయాణ వివరాలు ఇప్పుడే ఎయిర్ లైన్ వెబ్ సైట్ లో కనిపించకుండా జాగ్రత్తపడినట్లు వివరించారు. అయితే..పీఎన్ఆర్ నంబర్స్ వచ్చిన ప్రయాణికులు మాత్రమే విమాన షెడ్యూల్ వివరాలు కనిపిస్తాయని వెల్లడించింది. అయితే..ఒకటి రెండ్రోజుల్లో ఈ అనిశ్చితి తొలిగిపోతుందని, భారత్..యూఏఈ ప్రభుత్వాల నుంచి అనుమతి వస్తుందనే నమ్మకం ఉన్నట్లు చెబుతన్నారు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు.

ఇక యూఏఈకి చెందిన ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమ చార్టెడ్ ఫ్లైట్స్ కు సంబంధించి ముమ్మరంగా ప్రచారం చేశాయి. టికెట్ బుకింగ్స్ ప్రారంభించి ప్రయాణికుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నాయి. అంతేకాదు..ఒకే పీఎన్ఆర్ నెంబర్ మీద గ్రూప్ బుకింగ్స్ కూడా చేస్తున్నాయి. కానీ, ఇప్పటికే ఏ ఒక్క ఛార్టెడ్ విమానానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఇక జూన్ 10, 11 (రేపు, ఎల్లుండి) బయల్దేరాల్సిన చార్టెడ్ విమానాలకు కూడా ఇప్పటికి కూడా అనుమతులు రాలేదు. కేరళా నుంచి యూఏఈకి రేపు ఒక విమానం బయల్దేరాల్సి ఉంది. కానీ, అనుమతులు లేకపోవటంతో ప్రయాణంపై అనుమానాలు నెలకొని ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వ అనుమతి రాకుండా విమాన సర్వీసులు రద్దైతే ప్రయాణికులు చెల్లించిన డబ్బును అలాగే ఉంచి తర్వాతి ప్రయాణానికి టికెట్లు కేటాయించేలా కొన్ని ఏజెన్సీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంకొన్ని ఏజెన్సీలు మాత్రం తమ ప్రయాణికుల ఇష్టప్రకారం వెంటనే డబ్బులు ఇవ్వటం లేదంటే తర్వాతి ప్రయాణంలో వారికి ప్రధాన్యత కల్పిస్తామని చెబుతున్నాయి. ఇదిలాఉంటే..చార్టెడ్ విమానాల ప్రయాణంపై ఇంకా గందరగోళం నెలకొన్నా..ప్రయాణ సమయంలో మాత్రం ఖచ్చితంగా కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు పాటించాలని ఆయా ఏజెన్సీలు సూచించాయి. ప్రతి ఒక్క ప్రయాణికుడు కరోనా నెగటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని, అది కూడా 96 గంటలలోపు వచ్చిన రిపోర్ట్ నే అనుమతి ఇస్తామని ఏజెన్సీలు స్పష్టం చేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com