ఇండియా-యూఏఈ మధ్య ఒప్పందం..ఈ నెల 12 నుంచి విమానాలకు అనుమతి

- July 09, 2020 , by Maagulf
ఇండియా-యూఏఈ మధ్య ఒప్పందం..ఈ నెల 12 నుంచి విమానాలకు అనుమతి

ఇండియా నుంచి యూఏఈ తిరిగి వచ్చేందుకు సిద్ధమైన ప్రయాణికులకు ఎట్టకేలకు ఊరట కలిగించే నిర్ణయం వెలువడింది. ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులకు సంబంధించి కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది భారత విమానయాన సంస్థ. భారత్-యూఏఈ ప్రభుత్వాల మధ్య ఉన్న సన్నిహిత, వ్యూహాత్మక స్నేహబంధానికి అనుగుణంగా ఇరు దేశాల ప్రభుత్వాలు విమాన సర్వీసులపై ఓ అవగాహనకు వచ్చాయి. ఈ నెల 12 నుంచి 15 రోజుల పాటు విమాన సర్వీసులను నడిపేందుకు ఐసీఏ అనుమతి ఇచ్చింది. అయితే..కొన్ని షరతులను కూడా జోడించింది. యూఏఈలో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను భారత్ కు తీసుకొచ్చే యూఏఈ ఛార్టెడ్ ఫ్లైట్స్...తిరిగి ఇండియా నుంచి యూఏఈకి వెళ్లాలనుకుంటున్న యూఏఈ రెసిడెన్సీ వీసాదారులను తీసుకువెళ్లేలా అనుమతి ఇచ్చింది. అలాగే వందే భారత్ మిషన్ లో భాగంగా యూఏఈ నుంచి ప్రవాస భారతీయులను ఇండియా తీసుకొచ్చేందుకు విమాన సర్వీసులను నడిపిన సంస్థలు కూడా ప్రస్తుతం భారత్ నుంచి యూఏఈకి విమానాలను నడిసేందుకు ఐసీఏ అనుమతి ఇచ్చింది. అంటే యూఏఈ నుంచి భారత్ కు వచ్చే విమానాలకు మాత్రమే తిరిగి యూఏఈకి ప్రయాణికులను తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. అది కూడా యూఏఈ వెళ్లే వారి కోసం మాత్రమే ప్రస్తుత అవగాహణ ఒప్పందం అమలు కానుంది. ఈ నెల 12 నుంచి 26 వరకు మొత్తం 15 రోజుల పాటు విమానాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయాన్ని సమీక్షించుకునే అవకాశాలు ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com