యూఏఈ:కోవిడ్‌ కేసుల్ని గుర్తించేందుకు కె9 పోలీస్‌ డాగ్స్‌

- July 10, 2020 , by Maagulf
యూఏఈ:కోవిడ్‌ కేసుల్ని గుర్తించేందుకు కె9 పోలీస్‌ డాగ్స్‌

యూఏఈ:స్నిఫర్‌ డాగ్స్‌, అథారిటీస్‌కి అత్యంత ఉపయోగకరంగా వుంటాయి వారి విధుల్లో. క్రిమినల్స్‌ని గుర్తించే క్రమంలో వీటి పనితీరు అద్భుతం. ఈ నేపథ్యంలో కె9 పోలీస్‌ డాగ్స్‌ ద్వారా కరోనా పాజిటివ్‌ కేసుల్ని గుర్తించే అంశమై పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా, కె9 పోలీస్‌ డాగ్స్‌పై యూఏఈ ఇంటీరియర్‌ మినిస్ట్రీ కొన్ని ప్రయోగాలు చేసింది. వాటిల్లో కొన్నిటికి శిక్షణ కూడా ఇప్పించారు. ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతాల్లోంచి కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల్ని గుర్తించేందుకు వీటిని వినియోగిస్తారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తుల బాహుమూలాల నుంచి సేకరించిన నమూనాల ద్వారా వీటికి శిక్షణ ఇచ్చారు. ఆయా వ్యక్తులతో కాంటాక్ట్‌ లేకుండానే పోలీస్‌ డాగ్స్‌, కరోనా పాజిటివ్‌ వ్యక్తుల్ని గుర్తించేలా తర్ఫీదునిచ్చారు. ఫీల్డ్‌ ఎక్స్‌పెరిమెంటేషన్‌ స్టేజణ&ఇ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవి అందుబాటులోకి వస్తే.. కరోనాపై పోరులో కీలకమైన ముందుడుగా దీన్ని భావించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com