కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్ రామ్‌కుమార్ రాజీనామా

- July 10, 2020 , by Maagulf
కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్ రామ్‌కుమార్ రాజీనామా

అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బహుళ జాతి సంస్థ కాగ్నిజెంట్ కంపెనీ నుంచి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్ కుమార్రామమూర్తి తన పదవులకు రిజైన్ చేశారు. భారతదేశంలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులను కలిగివున్న కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో సుమారు 23 ఏండ్ల పాటు పనిచేసిన రామ్‌కుమార్ తన పదవుల నుంచి వైదొలిగారు. కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులకు ఆయన రాజీనామా చేశారు. కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంప్రీస్ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. రామ్ కుమార్ రామ్ కుమార్ సంస్థ ఉన్నతికి చాలా కృషి చేశారని ఆయన తెలిపారు. ఇక కంపెనీలో 24 ఏండ్లపాటు పనిచేసిన కాగ్నిజెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ప్రదీప్ షిలిగే కూడా సెప్టెంబర్ 30న వైదొలగనున్నారు.

ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో ఈ విషయాన్ని సీఈఓ బ్రియాన్ వెల్లడించారు. ప్రదీప్ కుటుంబంతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారని, తదుపరి సవాల్ కు సిద్ధమయ్యారని తెలిపారు. కాగా, ప్రదీప్ షిలిగే బాధ్యతలను ఆండీ స్టాఫోర్డ్ చేపట్టనున్నట్లు తెలిపారు. కాగ్నిజెంట్ సంస్థ నుంచి వీరిద్దరు వైదొలగడంతో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కరోనా మహమ్మారి కాలంలోనూ కాగ్నిజెంట్ సంస్థ మంచి ఫలితాలను సాధించిందని, ఇప్పటికే తమ సంస్థ అనేక దేశాల్లో సేవలందిస్తున్నదని బ్రియాన్ తెలిపారు. ప్రపంచంలో తమ కంపెనీ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. తమ సంస్థ సేవలను అందిస్తూనే ఉన్నదని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో బ్రియాన్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com