కువైట్:కొత్త వీసాల జారీ బంద్..వీసాల పొంది ఇంకా విదేశాల్లోనే ఉన్నవారి వీసాల రద్దు
- July 10, 2020
కువైటేజేషన్ లో భాగంగా జనాభా సమతుల్యతకు చర్యలు ప్రారంభించిన కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్త వీసాలను జారీ చేయటం లేదని ప్రకటించింది. అంతేకాదు..విమనాల రద్దుకు ముందు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. దీంతో లాక్ డౌన్ కు ముందు జారీ అయిన వర్క్ వీసా, విజిట్ వీసా, ఫ్యామిలీ వీసాలు రద్దు అయిపోయాయి. తదుపరి ప్రకటన వచ్చే వరకు కొత్త వీసాల జారీ ప్రస్తావనే ఉండదని, అసలు వీసా జారీ కేంద్రాలనే మూసివేస్తున్నట్లు కూడా కువైట్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో విదేశీయులకు ఇక కువైట్ వెళ్లే మార్గాలన్ని మూసుకుపోయినట్లే. ఇదిలాఉంటే వీసాలు పొంది ఇప్పటికే కువైట్ చేరుకున్న ప్రవాసీయులకు మాత్రం ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. మరోవైపు నివాస అనుమతి రెన్యూవల్ విషయంలో మాత్రం ప్రవాసీయులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉండి సరైన పాస్ట్ పోర్టు ఉన్న ప్రవాసీయుల నివాస అనుమతిని రెన్యూవల్ చేయనున్నట్లు కువైట్ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారికి ఫ్యామిలి వీసా, సెల్ఫ్ స్పాన్సర్ ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







