బంగారం అక్రమ రవాణా కేసు...NIA కు చిక్కిన కీలక నిందితులు
- July 12, 2020
తిరువనంతపురం:కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసును... కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించిన సంగతి తెలిసిందే.. కేరళలో జులై 4న యూఏఈ ఎంబసీకి చెందిన పార్శిల్లో... 15 కోట్ల రూపాయల విలువైన 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం దొరకడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. సీఎం ఆఫీస్‌లోని ప్రధాన కార్యదర్శిపై కూడా ఆరోపణలు రావడం, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్రతిపక్షాలు టార్గెట్ చేయడంతో.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని... ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు కేరళ సీఎం.. దీంతో.. కేంద్ర హోంశాఖ NIAను రంగంలోకి దించింది. అయితే.. శుక్రవారం రంగంలోకి దిగిన NIA.. 24 గంటలు గడవకముందే ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్, మరో నిందితుడు సందీప్ నాయర్లను అరెస్ట్ చేశారు. ఇవాళ బెంగుళూరులోని బీటీఎం లేఔట్ దగ్గర గోల్డ్ స్కాంలో ప్రధాన నిందితులు స్వప్న , నాయర్ ను అరెస్ట్ చేశారు.... వెంటనే వారిని కొచ్చికి తరలిస్తున్నారు .. రేపు ఉదయం వాళ్లను కోర్టులో హాజరు పర్చే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







