యూఏఈ:మార్చి, ఏప్రిల్ తో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాల్సిందే!
- July 12, 2020
యూఏఈ:రెసిడెన్సీ వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కు సంబంధించి కొత్త విధి విధానాలను ప్రకటించిన యూఏఈ..మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఫెడరల్, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ వీసా రెన్యూవల్ దరఖాస్తులను ఆదివారం (జులై 12) స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే..కరోనా ప్రభావం నేపథ్యంలో ICA కేంద్రాల్లో రద్దీని నియంత్రించేందుకు దశల వారీగా రెన్యూవల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మేతో గడువు ముగిసే రెసిడెన్సీ వీసాలను ఆగస్టు 8 నుంచి...జూన్, జులై 11 నాటికి గడువు ముగిసే రెసిడెన్సీ వీసాలను సెప్టెంబర్ 10 నుంచి ప్రాసెస్ చేయనున్నారు. ఇక ఇప్పటికే యూఏఈలో ఉండి రెసిడెన్సీ గడువు ముగిసిన వారికి మూడు నెలల మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు