2 KD చెల్లిస్తే సివిల్ ఐడీ కార్డుల హోండెలివరి అంటూ మోసాలు..

- July 12, 2020 , by Maagulf
2 KD చెల్లిస్తే సివిల్ ఐడీ కార్డుల హోండెలివరి అంటూ మోసాలు..

కువైట్ సిటీ:కువైట్ సివిల్ ఐడీ కార్డుల మోసాలపై పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 2 కువైట్ దినార్ లు చెల్లిస్తే చాలు..సవిల్ ఐడీ కార్డులను ఇంటికే పంపిస్తామంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకే చిరునామా ఒకటి కంటే ఎక్కువ కార్డులు పంపిస్తే ఒక్కో కార్డుపై అదనంగా క్వార్టర్ దినార్ చెల్లిస్తే చాలంటూ కొందరు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సివిల్ కార్డుల హోం డెలివరిపై పీఏసీఐ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తాము ప్రస్తుతానికి సివిల్ కార్డులను హోం డెలివరి చేయటం లేదని, ఇప్పుడు కేవలం హోండెలివరి బిడ్డింగ్ దశలోనే ఉందని తెలిపింది. కార్డుల హోం డెలివరి ఫీజులు, విధివిధానాలపై ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని..ప్రజలు ఎవరూ సోషల్ మీడియాలో పోస్టులను నమ్మి మోసపోవద్దని వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com