కరోనా కష్ట కాలంలో గజల్ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవలు

- July 13, 2020 , by Maagulf
కరోనా కష్ట కాలంలో గజల్ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవలు

భారతీయ సంస్కృతి పరిరక్షణ, తెలుగు గజల్ వికాసం, ప్రపంచ శాంతి ప్రచారం, సామాజిక సేవ లు లక్ష్యంగా 2005 లో  (Reg101/2005) గజల్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం జరిగింది. ప్రముఖ గజల్ గాయకుడు డా. శ్రీనివాస్ కేశిరాజు (గజల్) ,సురేఖ శ్రీనివాస్, రాయప్రోలు భగవాన్ (చార్టెడ్ అకౌంటెంట్, భీమవరం),అడ్డాల వాసుదేవరావు (ప్రజనాయకులు, మేడపాడు గ్రామం) లు సభ్యులుగా,వారి నిర్వహణలో గత 15 ఏళ్లుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో తన ముద్రను చాటుకుంటొంది.

కరోనా  కష్ట కాలంలో, ట్రస్ట్ "అన్న వితరణ " కార్యక్రమాన్ని చేబట్టి అన్ని లాక్ డౌన్ నేపధ్యంలో నిరాటంకంగా కొనసాగించింది.ఆదాయానికి , సంపాదనకు అవకాశం లేని కళాకారులకు, అర్చకులకు ఆర్థిక సేవ, గృహనిత్యావసర సరుకులు అన్ని ప్రాంతాలలో అందజేసింది. వలసకార్మికులకు అండగా నిలిచింది. కోవిడ్ పై అవగాహన కలిగించేందుకు ఎన్నో గీతాలను, వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది ట్రస్ట్. 

గజల్ చారిటబుల్ ట్రస్ట్

గజల్ వికాసం కోసం ఎన్నో సదస్సులు, సమావేశాలు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి గజల్ రచనలో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసింది. గజల్ గానం లో శిక్షణా తరగతులు నిర్వహించింది. తెలుగు గజల్ వెబ్సైట్ ద్వారా గజల్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఎన్నో గజళ్ళను ధ్వని ముద్రణ చేసి అల్బమ్స్ గా విడుదల చేయడం చేసింది. గజల్ వీడియోలు రూపొందించి గజల్ ప్రచారం లో బహుముఖం గా కృషి చేస్తోంది. ఎన్నో గజల్ గ్రంధాల ముద్రణకు ఆర్థికసహయం అందజేసింది ట్రస్ట్. 

ప్రపంచ శాంతి కోసం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయిల్, ఆఫ్రికా, లాంటి ఎన్నో దేశాల్లో శాంతి సదస్సులు నిర్వహించి, ఆయా దేశాలలో సేవ కార్యక్రమాలు నిర్వహించింది ట్రస్ట్. ఆయా దేశ భాషల్లో శాంతి, స్నేహ సుహృద్భావ గీతాల ఆల్బమ్స్  శాంతి యాత్ర, సలాం బుగో, రుబరూ, దూస్తి సోల్   విడుదల చేసింది ట్రస్ట్. 

మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రచారానికి శ్రీకారం చుట్టి "సత్యాగ్రహ సందేశ్ యాత్ర, పాత్ ఆఫ్ గాంధీ "లాంటి ఆడియో ఆల్బమ్స్ విడుదల చేసింది ట్రస్ట్. 

నల్గొండ జిల్లా లో ఫ్లోరోసిస్ బాధితుల సేవ కోసం సీతమ్మ తండా, బాలెంల ప్రాంతాల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్న బాధితులను ఆదుకునేందుకు ఉద్ధానం ఫౌండేషన్, NATS, USA సహకారంతో 25 కు పైగా RO వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసింది ట్రస్ట్ 

వృద్ద ఆశ్రమాలకు, అనాధ శరణాలయాలకు , దివ్యాన్గులకు బాసటగా నిలబడి ఎన్నో సామాజిక సేవా సంస్థలకు ఆర్ధిక సహాయం చేస్తోంది ట్రస్ట్. 

మంగళం పల్లి బాలమురళీకృష్ణ జన్మస్థల అభివృద్ధి ,శంకరుగుప్తం,అల్లూరి సీతారామరాజు పూర్వ గృహ జీర్ణోద్ధరణ, మొగల్లు, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ అభివృద్ధి, జిల్లా కేంద్ర కారాగారాలలో సంగీత కార్యక్రమాలు, గాంధీయన్ స్టడీ సెంటర్ , నర్సాపురం ద్వారా మహాత్మాగాంధీ సత్యాగ్రహ సర్టిఫికెట్ తరగతుల నిర్వహణ ట్రస్ట్ నిర్వహిస్తోంది. 

ఉత్తర భారతంలోని ప్రముఖ సంస్థలు షహీద్ మేళా, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, చంబల్ ఫౌండేషన్  అలాగే రోటరీ, లయన్స్ ,వాసవీ ఇంటర్నేషనల్ క్లబ్ లతో కలసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

ఎన్నో దేశ భక్తి, భారతీయ సంస్కృతి స్ఫూర్తి కార్యక్రమలు దేశ వ్యాప్తంగా గత 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న గజల్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com