షార్జా గవర్నమెంట్‌: జులై 19 నుంచి 100 శాతం స్టాఫ్‌

- July 15, 2020 , by Maagulf
షార్జా గవర్నమెంట్‌: జులై 19 నుంచి 100 శాతం స్టాఫ్‌

షార్జా:షార్జా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ డైరెక్టివ్స్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు 100 శాతం జులై 19 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తారని షార్జా డైరెక్టరేట్‌ ఆఫ్‌ హ్యామన్‌ రిసోర్సెస్‌ వెల్లడించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌ జారీ అయ్యింది. షార్జా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ అలాగే ఎస్‌హెచ్‌ఆర్‌డి ఛైర్మన్‌ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, షార్జా ఎమిరేట్స్‌లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయని చెప్పారు. అన్ని ప్రికాషనరీ మెజర్స్‌ తీసుకుంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌, ఆ తర్వాత ఆంక్షల కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com