దుబాయ్:సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష

- July 15, 2020 , by Maagulf
దుబాయ్:సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష

దుబాయ్:కరోనా మహమ్మారి నేపథ్యంలో సోషల్ మీడియా/వాట్సాప్లో వైరల్ అవుతున్న అపోహ ప్రచారాల పట్ల దుబాయ్ పాలకవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి ఎవరైనా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తే ఏడాది పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్ ఇచ్చింది. కరోనా మహమ్మారితో ఇప్పటికే జనంలో ఆందోళన నెలకొనగా..కొందరు వ్యక్తులు అనవసర మేసేజ్ లతో ప్రజలను మరింత భయపెడుతున్నారన్నది పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదన. ఇక నుంచి ఎవరైనా  సోషల్ మీడియా లేదా  వాట్సాప్లో ఒక మేసేజ్ ను ఇతరులకు ఫార్వార్డ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించింది. సంబంధిత శాఖ అధికారిక వివరాలతో సరిపోల్చుకోకుండా..పూర్తిగా నిరాధారమైన వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు షేర్ చేయొద్దని హెచ్చరించింది. ప్రజలను భయాందోళనలకు గురిచేసేందుకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మిమ్ములను ఓ సాధానంగా వాడుకోవచ్చని, అలాంటి మేసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండితీరాల్సిందేనని సూచించింది. ఒక్కసారి ఓ వ్యక్తి నుంచి మేసేజ్ ఇతరులకు ఫార్వార్డ్ అయితే..దానికి పూర్తి ఆ వ్యక్తిదేనని స్పష్టతనిచ్చింది. తమకు తెలియకుండా ఫార్వార్డ్ చేశామని చెప్పినా ఆ వాదనలు చెల్లవని కూడా వెల్లడించింది. రూమర్లను వైరల్ చేసిన వ్యక్తులపై నిస్సందేహంగా కఠిన చర్యలు తీసుకుంటామని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com