యూ.ఏ.ఈ నుంచి తెలుగు రాష్ట్రాలకు 10 ఛార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు

- July 15, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ నుంచి తెలుగు రాష్ట్రాలకు 10 ఛార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు

యూ.ఏ.ఈ:ఏ.పి ముఖ్యమంత్రి  Y.S.జగన్మోహన్  రెడ్డి ఆదేశాలు మేరకు APNRT చైర్మన్ మరియు ప్రభుత్వ సలహాదారు వెంకట్ మేడపాటి వారి పర్యవేక్షణలో యూ.ఏ.ఈ నుంచి కోస్తా ట్రావెల్స్ వారి సహాయంతో ఈ రోజువరకు 8 ప్రత్యేకవిమానాలు ఆంధ్రప్రదేశ్ కు,రెండు ప్రత్యేకవిమానాలు తెలంగాణ రాష్ట్రాలకు 1680 మంది తెలుగు పనులు కోల్పోయిన శ్రామికులతోటి ,గర్భిణీ  స్త్రీ లకు ,అత్యవసర వైద్య సదుపాయము  కావలసిన వారి గూర్చి నడిపినట్లు, మరియు 8ప్రత్యేక విమానాలు నడుపుటకు నిర్ణయం తీసుకోనట్టుగా APNRT యూఏఈ పర్యవేక్షుకులు, వైస్సార్సీపీ యూఏఈ కోర్డినేటర్ సత్తి ప్రసన్న సోమిరెడ్డి ఒక  పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అహర్నిశలు కృషిచేస్తున్న టీం సభ్యులు రెడ్డయ్యరెడ్డి, శ్యాంరెడ్డి,కుమార్ చంద్, పడాల బ్రహ్మానంద రెడ్డి, సుబ్బారెడ్డి ,మోహన్,జాఫర్అలీ, నాజర్ వలి,అక్రమ్, రమేశ్ రెడ్డి మరియు తదితర APNRT బృందానికి UAE తెలుగుసమాజం కృతజ్ఞతలు తెలుపుచున్నది.ఈ కార్యక్రమానికి విశేషమైన సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి Y.S.జగన్మోహన్  రెడ్డి ,APNRT చైర్మన్ వెంకట్ మేడపాటి ,UAE లోని షార్జా ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాన్సన్ , APNTT  సీఈఓ శ్రీనివాస్ రావు యూఏఈ లో ఉన్న తెలుగు ప్రజలు తరుపున కృతజ్ఞతలు తెలపడము జరిగినది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com