నిరసన వ్యక్తం చేసిన 12 మంది వలసదారుల అరెస్ట్
- July 15, 2020
కువైట్ సిటీ:నిరసన తెలిపే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిపై దూషణలకు దిగిన కారణంగా 12 మంది ఈజిప్టియన్ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 60 మందికి పైగా వలసదారులు అబు ఫతైరాలోని మేన్ పవర్ డిపార్ట్మెంట్స్ వద్ద గుమికూడి, తమ వేతనాల విషయమై ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడంలేదని ఆందోళన చేశారు వలసదారులు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని, వలసదారులు గవర్నమెంట్ కాంట్రాక్టులతో పనిచేస్తున్నారనీ, వారికి సేలరీలు అందడంలేదని గుర్తించారు. కాగా, ముబారక్ అల్ కబీర్ గవర్నరేట్ బ్రిగేడియర్ జనరల్, ముబరక్ మర్జి బ్రిగేడియర్ జనరల్, వలసదారుల ఫిర్యాదుల్ని స్వీకరించారు. వారి సమస్యల్ని మ్యాన్ పవర్ అథారిటీకి తెలియజేస్తామని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







