హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన: 648 వ్యాపారాల మూసివేత
- July 15, 2020
రియాద్:రియాద్ మునిసిపాలిటీ ఇన్‌స్పెక్షన్ టీమ్స్, 648 వ్యాపారాల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 హెల్త్ ప్రోటోకాల్స్‌ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తం 24,000 ఇన్‌స్పెక్షన్ విజిట్స్ గత వారంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనల్ని గుర్తించారు. స్టాఫ్‌కి డిస్‌ఇన్‌ఫెక్టెంట్స్ అందించడం, శానిటైజర్స్ ఇవ్వడం అలాగే స్టాఫ్‌కీ, వినియోగదారులకీ ప్రవేశ మార్గాల్లో టెంపరేచర్స్ చెక్ చేయడం వంటి ప్రికాషనరీ మెజర్స్ చేపట్టాల్సి వుంటుంది. షాపింగ్ ట్రాలీస్‌ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సి వుంటుంది. వినియోగించిన ప్రతిసారీ శానిటైజ్ చేయాల్సిందే. షాప్‌ల వద్ద ఎక్కువగా జనం గుమికూడకుండా చూడాలి. ఉల్లంఘనలకు పాల్పడితే జరీమానాలు ఖచ్చితంగా విధిస్తారు. 5,000 సౌదీ రియాల్స్ నుంచి 100,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది ఉల్లంఘనలకు పాల్పడితే.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







