నిరసన వ్యక్తం చేసిన 12 మంది వలసదారుల అరెస్ట్‌

- July 15, 2020 , by Maagulf
నిరసన వ్యక్తం చేసిన 12 మంది వలసదారుల అరెస్ట్‌

కువైట్ సిటీ:నిరసన తెలిపే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిపై దూషణలకు దిగిన కారణంగా 12 మంది ఈజిప్టియన్‌ వలసదారుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. 60 మందికి పైగా వలసదారులు అబు ఫతైరాలోని మేన్‌ పవర్‌ డిపార్ట్‌మెంట్స్‌ వద్ద గుమికూడి, తమ వేతనాల విషయమై ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా తమకు జీతాలు అందడంలేదని ఆందోళన చేశారు వలసదారులు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని, వలసదారులు గవర్నమెంట్‌ కాంట్రాక్టులతో పనిచేస్తున్నారనీ, వారికి సేలరీలు అందడంలేదని గుర్తించారు. కాగా, ముబారక్‌ అల్‌ కబీర్‌ గవర్నరేట్‌ బ్రిగేడియర్‌ జనరల్‌, ముబరక్‌ మర్జి బ్రిగేడియర్‌ జనరల్‌, వలసదారుల ఫిర్యాదుల్ని స్వీకరించారు. వారి సమస్యల్ని మ్యాన్‌ పవర్‌ అథారిటీకి తెలియజేస్తామని భరోసా ఇచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com