అబుధాబి:వాహనదారులకు హెచ్చరిక.. స్పీడ్ లేన్ లో నెమ్మదిగా వెళ్తే DH 400 జరిమానా
- July 16, 2020
అబుధాబి:వాహనదారులకు అబుధాబి పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. స్పీడ్ లేన్లలో ఎవరైనా వాహనదారులు నెమ్మదిగా వెళ్లినా..ఎడమ వైపు నుంచి వచ్చే వాహనాలకు దారి ఇవ్వకపోయినా DH 400 వరకు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. లెఫ్ట్ లేన్ లో వెళ్లే వాహనాలను ఆయా రహదారిలో నిర్దేశించిన నిర్ణీత వేగంతో వెళ్లాలని పోలీసులు సూచించారు. అలాకాకుండా నెమ్మదిగా వెళ్లటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు ప్రమాదాలకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. నెమ్మదిగా వెళ్లే వాహనాలను స్పీడ్ లేన్ లో కాకుండా కుడి వైపు దారిలో వెళ్లాలని అబుధాబి పోలీసులు సూచించారు. గత సెప్టెంబర్ లో ప్రారంభించిన 'బీ రోడ్ సేఫ్' క్యాంపేన్ లో భాగంగా ఈ తాజా హెచ్చరికలు జారీ చేశారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?