మస్కట్:సరైన అనుమతులతో ప్రవాసీయులు ఓమన్ తిరిగి రావొచ్చు
- July 16, 2020
మస్కట్:లాక్ డౌన్ తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు, విద్యార్ధులు ఓమన్ తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆయా దేశాల్లోని ఓమన్ రాయబార కార్యాలయం నుంచి అనుమతి పొందిన వాళ్లంతా ప్రత్యేక విమానాల్లో తిరిగి ఓమన్ రావొచ్చని అధికారులు వెల్లడించారు. లాక్ డౌన్ కు ముందు స్వదేశాలకు వెళ్లిన వారు..ఆఫీసు పనుల నిమిత్తం, వ్యాపార పనుల కోసం విదేశాలకు వెళ్లిన వారు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావటంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు..చదువు కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్ధులు కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి వారు వెంటనే ఆయా దేశాల్లోని ఓమన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తగిన అనుమతులు పొందాలని, అనుమతి తీసుకున్నవారు నిరభ్యంతరంగా ఓమన్ తిరిగి రావొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?