సౌదీ:వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
- July 16, 2020
రియాద్:వరుస చోరీలకు పాల్పడుతున్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు వ్యక్తులున్న ఈ ముఠా సౌదీ అరేబియాలోని దమ్మమ్ ప్రాంతంలో కొద్ది కాలంగా వరుస చోరీలకు పాల్పడుతోంది. పోలీసులమని చెబుతూ ఇళ్లలోకి చొరబడి దోపిడికి తెగబడింది. పార్క్ చేసిన వాహనాలను ఎత్తుకుపోవటం..ఆయుధాలతో కార్మికులను బెదిరించి వారి దగ్గర్నుంచి డబ్బు ఎత్తుకెళ్తూ దురాగాతాలకు పాల్పడింది. ముఖ్యంగా ప్రవాస కార్మికులను టార్గెట్ గా చేసుకొని పోలీసులమని బెదిరించి ఉన్నదంతా దోచుకుపోయేవారు. ఈ దొంగల ముఠా అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదుల వెల్లువలా వచ్చిపడటంతో..వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా టీమ్ ను ఏర్పాటు చేశారు దమ్మమ్ పోలీసులు. కొన్నాళ్లుగా పలు ప్రాంతాల్లో నిఘా వేశారు. ఎట్టకేలకు ముగ్గురు వ్యక్తులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. 47 నేరాల్లో ముగ్గురు దొంగలు నిందితులుగా ఉన్నారు. పట్టుబడిన దొంగల ముఠాను రిమాండ్ కు తరలించిన పోలీసులు..తదుపరి న్యాయవిచారణ కోసం కేసును బదిలీ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?