యూ.ఏ.ఈ:1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియ‌న్ స్కూల్ ప్రిన్సిపాల్...‌

- July 16, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియ‌న్ స్కూల్ ప్రిన్సిపాల్...‌

యూ.ఏ.ఈ :అజ్మాన్‌లోని ఇండియ‌న్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్‌లో జాక్‌పాట్ త‌గిలింది. గ్లోబ‌ల్ ఇండియ‌న్ స్కూల్ అజ్మాన్ ప్రిన్సిపాల్‌గా ప‌నిచేస్తున్న మాల‌తి దాస్‌ డి.డి.ఎఫ్ డ్రాలో ఏకంగా ఒక మిలియ‌న్ డాల‌ర్లు(36,73,026 dhs)‌ గెలుచుకున్నారు. గ‌త 32 ఏళ్లుగా ఆమె ఈ రాఫెల్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, జూన్ 26న కొన్న లాట‌రీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటిశ్వ‌రురాలిని చేసింది. దీంతో మాల‌తి ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఇంత భారీ మొత్తం గెలుచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా రాఫెల్ నిర్వ‌హ‌కుల‌కు మాల‌తి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక‌పై కూడా తాను డి.డి.ఎఫ్ ఫ్రీ ర్యాఫిల్ టికెట్లు కొన‌డం మానబోయేది లేద‌ని చెప్పారు.
1999లో ప్రారంభ‌మైన ఈ ర్యాఫిల్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు కోటిశ్వ‌రులుగా అవ‌త‌రించిన భార‌తీయుల‌లో మాల‌తితో క‌లిపి 165 మంది అయ్యార‌ని లాట‌రీ నిర్వ‌హ‌కులు తెలియ‌జేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com