యూ.ఏ.ఈ:విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా
- July 16, 2020
యూ.ఏ.ఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. లాక్ డౌన్ యూఏఈలో ఉండే ప్రవాసీయులు పలు దేశాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసింది. వాళ్లందరూ తిరిగి యూఏఈ చేరుకునేందుకు నిబంధనలను సులభతరం కూడా చేసింది. ఆగస్ట్ ఫస్ట్ నుంచి విమాన సర్వీసులను కూడా ప్రారంభించబోతోంది. అయితే..వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న యూఏఈ..విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని నిబంధన విధించింది. వైరస్ తక్కువ తీవ్రత ఉన్న దేశాల నుంచి వచ్చిన వారు వారం పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని, అలాగే ఎక్కువ తీవ్రత కలిగిన దేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు