మస్కట్:ఇండియా నుంచి ఒమన్ వెళ్లే ప్రవాసీయులకు కొత్త మార్గదర్శకాలు జారీ
- July 17, 2020
మస్కట్:ఇండియా నుంచి ఓమన్ వెళ్లాలనుకుంటున్న ప్రవాసీయులకు భారత్ లోని ఓమన్ రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్ డౌన్ తో ఇండియాలోనే చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు తిరిగి ఓమన్ వెళ్లేందుకు ఇరు దేశాల అనుమతి తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలోని ఓమన్ రాయబార కార్యాలయం ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసింది. ఓమన్ లోని తమ కుటుంబ సభ్యులు లేదా వారు పని చేసే కంపెనీ యాజమాన్యం ద్వారా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకొని ఎంట్రీ పర్మిట్ పొందాలని తెలిపింది. ఆ అనుమతి పత్రాల ద్వారా తమ ప్రయాణానికి స్థానికంగా క్లియరెన్స్ చేసుకోవాలని, ఆ తర్వాత ఇండియాలోని ఓమన్ రాయబార కార్యాలయం ప్రవాసీయుల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేస్తుందని అధికారులు వివరించారు. నిజానికి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులతో రెండు దేశాల మధ్య పౌర విమానయాన సౌకర్యాలు రద్దైపోయాయి. అయితే..ఇండియాలో చిక్కుకుపోయిన ప్రవాసీయులను మానవతా కోణంలో తిరిగి ఓమన్ తరలిచేందుకు ప్రత్యేకంగా విమానాలు నడుపుతున్నట్లు రాయబార కార్యాలయం గుర్తు చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?