అబుధాబి:మోడిఫై కార్లపై కొరడా...గతేడాదిలో 11వేల వాహనదారులకు ఫైన్
- July 17, 2020
అబుధాబి:మోడిఫై కార్లతో పెద్దగా శబ్ధాలు వచ్చేలా డ్రైవింగ్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న వాహనదారులపై యూఏఈ పోలీసులు కొరఢా ఝుళిపించారు. పోయిన ఏడాది ఏకంగా 11 వేల మంది వాహనదారులకు జరిమానా విధించారు. కంపెనీ కార్లకు కొత్త సైలెన్సర్లను బిగించి పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చేలా రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లటం కుర్రకారుకు షోకుగా మారిపోయింది. అలాగే మోడిఫై కార్లతో రేస్ లలో పాల్గొంటున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇలా ప్రధాన రహదారులు, నివాసిత ప్రాంతాల మధ్య న్యూసెన్స్ చేస్తున్న వాహనదారులకు ఒక్కొక్కరికి Dh2,000 జరిమానా 12 బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ విధించారు పోలీసులు. అలాగే హారన్ సౌండ్ ను పెంచి పాదచారులను అదరగొట్టేలా న్యూసెన్స్ చేస్తున్న వారికి Dh400 జరిమానా 4 బ్లాక్ ట్రాఫిక్ పాయింట్స్ విధించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







