సివిల్ ఐడీ జారీ కోసం రెండు హాల్స్ ప్రారంభించిన పిఎసిఐ
- July 17, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకోసం అలాగే తేలికైన ట్రాన్సాక్షన్స్ కోసం రెండు హాల్స్‌ని ప్రారంభించింది. ఒకటి వృద్ధుల కోసం ఇంకొకటి స్పెషల్ నీడ్స్ కలిగిన వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వర్కింగ్స్ అవర్స్‌లో పైన పేర్కొన్న కేటగిరీకి చెందినవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఈ హాల్స్‌ని ప్రారంభించారు. పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ సబర్ మాట్లాడుతూ, హెల్త్ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా అపాయింట్‌మెంట్స్ ఇవ్వబడతాయని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అప్రూవల్ కోసం పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ అలాగే కువైట్ క్రెడిట్ బ్యాంక్‌ని ఉదయం వేళల్లో సంప్రదించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







