ప్రైవేట్‌ సెక్టార్‌ నుంచి గవర్నమెంట్‌ సెక్టార్‌కి వీసా బదిలీ బ్యాన్‌

- July 17, 2020 , by Maagulf
ప్రైవేట్‌ సెక్టార్‌ నుంచి గవర్నమెంట్‌ సెక్టార్‌కి వీసా బదిలీ బ్యాన్‌

కువైట్‌ సిటీ: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మ్యాన్‌ పవర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ అల్‌ మౌసా, వలసదారులకు సంబంధించి వీసాల్ని ప్రైవేట్‌ సెక్టార్‌ నుంచి గవర్నమెంట్‌ సెక్టార్‌కి ట్రాన్స్‌ఫర్‌ని బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అల్‌ మౌసా, జులై 14న డెసిషన్‌ని విడుదల చేశారు. అఫీషియల్‌ గెజిట్‌లో ప్రచురణ తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. అయితే, మూడు కేటగిరీల్ని బదిలీ నుంచి మినహాయించారు. కువైటీ పౌరుల్ని పెళ్ళి చేసుకున్నవారు, పిల్లలు, అలాగే భార్యలు ఓ కేటగిరీ కాగా, పాలస్తీనియన్‌ జాతీయులు ఇంకో కేటగిరీ. మూడో కేటగిరీలో మెడికల్‌ ఫీల్డ్‌కి సంబంధించిన హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ (మెడికల్‌ ప్రొఫెషన్‌ ప్రాక్టీస్‌కి సంబంధించి లైసెన్సు వుండాలి). 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com