జులై 23 నుంచి అంతర్జాతీయ విమానాలు

- July 17, 2020 , by Maagulf
జులై 23 నుంచి అంతర్జాతీయ విమానాలు

ఇరాక్‌ ఎయిర్‌ పోర్ట్స్‌, అంతర్జాతీయ విమానాలకు జులై 23 నుంచి ఆహ్వానం పలకనున్నాయి. కరోనా వైరస్‌ తర్వాత క్రమక్రమంగా ఆంక్షల్ని సడలిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్‌ విమానాలకు వెసులుబాటు కల్పించనుండడం గమనార్హం. ఇరాకీ కుర్దిస్తాన్‌ రీజియన్‌కి కూడా ఈ సడలింపు వర్తిస్తుంది. ఇరాకీ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ, మార్చి నెలలో కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాల రాకపోకల్ని నిలిపివేసింది కరోనా నేపథ్యంలో. కాగా, అంతర్జాతీయ విమానాలకు అనుమతిచ్చినప్పటికీ, అవసరమైన ముందస్తు జాగ్రత చర్యలు, నిబంధనలు తప్పవని పేర్కొన్నారు అధికారులు. కాగా, రాత్రి 9.30 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్‌ఫ్యూ కొనసాగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com