భారత్ లో పెట్రోల్, డీజిల్‌కు తగ్గిన డిమాండ్
- July 17, 2020
దేశంలో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ భారీగా పడిపోయింది. పలు నగరాల్లో తిరిగి లాక్డౌన్ విధించడం, పెరుగుతున్న ధరల వంటి కారణాలతో ఈ నెల మొదటి అర్ధభాగంలో పెట్రోలు, డీజిల్‌కు డిమాండ్ తగ్గింది. ఇక గత నెల ఇదే సమయంతో పోలిస్తే కూడా డిమాండ్ బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. చమురు దిగుమతి, వినియోగంలో భారత్‌ది ప్రపంచంలోనే మూడో స్థానం కాగా, లాక్డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్‌లో పెట్రో అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. జూలై తొలి అర్ధ భాగంలో డీజిల్ అమ్మకాలు 18 శాతానికి పడిపోయి 2.2 మిలియన్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయి. జూన్‌లో ఇదే సమయంలో దాదాపు 21 శాతం డీజిల్ విక్రయాలు జరిగినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







