అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల గురి: కమాండర్వీ ఎస్ ఠాకూర్
- July 17, 2020
హిందువులకు గొప్ప పుణ్యతీర్థమైన అమర్నాథ్ ఆలయంపై తీవ్రవాదులు దృష్టి సారించినట్లు సైన్యం చెబుతోంది. అమర్నాథ్ యాత్రకోసం వెళ్లే యాత్రికులే లక్షంగా దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొంది. మరో 4 రోజుల్లో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ రహదారి-44 పైనే తీవ్రవాదులు గురిపెట్టినట్లు సెక్టార్-2 కమాండర్, బ్రిగేడియర్ వీఎస్ ఠాకూర్ తెలిపారు. ఈ మార్గం నుంచే యాత్రికులు ఉత్తర ప్రాంతాలకు చేరుకుంటారని, అందువల్ల ఈ ప్రాంతమే అత్యంత ప్రాధాన్యమైందని వివరించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి-44 మొత్తం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని, అమర్నాథ్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ కల్పిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







