ఫ్లీట్‌ రివ్యూను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

- February 04, 2016 , by Maagulf
ఫ్లీట్‌ రివ్యూను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

నగరంలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ప్రారరభించారు. ఈ సందర్భంగా విక్టరీ ఎట్‌ సీ స్థూపం వద్ద అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా ఐఎఫ్‌ఆర్‌ గ్రామం రూపకల్పన జరిగింది. నేవీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పవరకు వచ్చిన మార్పులపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ సందర్భంగా విశాఖ సర్వాంగసుందరంగా ముస్తాబు అయింది. విద్యుత్ కాంతులతో సాగర తీరం కళకళలాడుతోంది. అంతకుముందు ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న చంద్రబాబునాయుడుకు ఆర్మీ చీఫ్ ధోవన్, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి తదితరులు స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com