సౌదీలో చిక్కుకుపోయిన 105 మందిని వెనక్కి రప్పించిన యూఏఈ

- July 18, 2020 , by Maagulf
సౌదీలో చిక్కుకుపోయిన 105 మందిని వెనక్కి రప్పించిన యూఏఈ

షార్జా:కరోనా వైరస్‌ నేపథ్యంలో సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 105 మంది కార్మికుల్ని యూఏఈ ఎయిర్‌ లిఫ్ట్‌ చేసింది. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక చార్టర్డ్‌ విమానంలో వారంతా చేరుకున్నారు. ఓసియన్‌ ఆయిల్‌ ఫీల్డ్‌లో వీరంతా పనిచేస్తున్నారు. ఆఫ్‌షోర్‌ ఆన్‌ షోర్‌ ప్రాజెక్టుల నిమిత్తం వీరంతా షార్జా ఫ్రీ జోన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌ అప్రూవల్‌ తర్వాత ప్రయాణీకుల్ని రీపాట్రియేషన్‌ చేశారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, యూఏఈ ఫెడరల్‌ గవర్నమెంట్‌, షార్జా పోలీస్‌ అథారిటీస్‌ అలాగే ఎయిర్‌ అరేబియా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ని చేపట్టడం జరిగింది. 105 మంది తిరిగి రావడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఓసియన్‌ ఆయిల్‌ ఫీల్డ్‌ ఛైర్మన్‌ మొహమ్మద్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com