ఇరాన్లో కరోనా విశ్వరూపం...
- July 19, 2020
టెహ్రాన్:ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇక ఇరాన్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశంలో రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్ సోకి ఉండవవచ్చని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ అన్నారు. కరోనా మహమ్మరి వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఆరోగ్య శాఖ చేసిన అధ్యాయనంలో ఊహించని సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయని అన్నారు. రాబోయే నెలలో ౩ కోట్ల మందికి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని రౌహానీ అంచనా వేశారు. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఇరాన్ రాజధాని టెహ్రన్లో మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు మొదలైయ్యాయి.
కాగా, ఇరాన్లో గడిచిన 24గంటల్లో 2,166 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 188 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,70,000కు చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు మొత్తం 13,973 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?