కువైట్ విమానాశ్రయం సమీపంలో చెలరేగిన మంటలు
- July 19, 2020
కువైట్ విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఆహార పదార్ధాలు సరఫరా చేసే ఓ బిల్డింగ్ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బిల్డింగ్ దాదాపు 4000 చదరపు అడుగులు విస్తరించి ఉంది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో పెద్ద ఎత్తున అహారా పదార్ధాల బాక్సలు ఉన్నాయి. అయితే..బిల్డింగ్ లో మంటలు చెలరేగాయని సమాచారం అందిన రెండు నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఓ వైపు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూనే..మరోవైపు గంట సమయంలోనే బిల్డింగ్ ఖాళీ చేశారు. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఇదిలాఉంటే అగ్నిప్రమాదం విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకోవటంతో కొద్దిమేర ఆందోళన కలిగించినా..విమానాల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?