యూ.ఏ.ఈ:మాల్స్,టవర్స్ లో రేపటి నుంచి ప్రార్ధనలకు అనుమతి

- July 19, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:మాల్స్,టవర్స్ లో రేపటి నుంచి ప్రార్ధనలకు అనుమతి

యూ.ఏ.ఈ:లాక్ డౌన్ తర్వాత సాధారణ జనజీవన పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా మరో కీలక నిర్ణయం వెలువడింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి అన్ని మాల్స్, టవర్స్ లోని ప్రార్ధనా గదుల్లో ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే..కరోనా వ్యాప్తి నియంత్రణకు పాటించాల్సిన అన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.  ప్రార్ధనా మందిరం కోసం కేటాయించిన గది సామర్ధ్యంలో 30 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే ప్రతి భక్తుడి మధ్య ఖచ్చితంగా 2 మీటర్ల దూరం పాటించాలి. ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ప్రార్ధనకు ముందు, ప్రార్ధన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ జనం ఒక్క దగ్గర గూమికూడొద్దు. అలాగే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆలింగనం చేసుకోకూడదు. ఇక ప్రార్ధన సమయంలోనూ జాగ్రత్తలు పాటించాలంటూ కొన్ని సూచనలు చేసింది. ప్రతి భక్తుడు అల్ హోస్న్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ స్మార్ట్ ఫోన్ లో చూసుకుంటూ పవిత్ర ఖురాన్ ను చదవాల్సి ఉంటుంది. ప్రార్ధన ముగిసిన వెంటనే స్టెరిలైజ్ చేయాలని మార్గదర్శకాలు వెలువరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com