సస్పెన్స్ వీడిపోయింది..ప్రభాస్ సరసన ఆమెనే!!

- July 19, 2020 , by Maagulf
సస్పెన్స్ వీడిపోయింది..ప్రభాస్ సరసన ఆమెనే!!

బాలీవుడ్ కథానాయికలకు టాలీవుడ్ లో ఉండే గిరాకీ వేరు. ముంబై బెంగళూరు వంటి టాప్ క్లాస్ నగరాల ర్యాంపు నుంచి వచ్చే మోడల్స్ కి తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ కోవలో ఇప్పటికే టాలీవుడ్ లో ఎందరో ప్రవేశించి.. అందులో కొందరు అగ్ర కథానాయికలు అయిన వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ తదుపరి చిత్రానికి కథానాయికను ముంబై భామనే ఎంపిక చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభాస్ 21 ప్రకటించినప్పటి నుండి కథానాయిక కోసం వెతుకుతూనే ఉన్నారు నాగ్ అశ్విన్- దత్ బృందం. నిన్న మొన్నటివరకూ పలువురు బాలీవుడ్ నటీమణుల పేర్లు ప్రభాస్ 21 కి పరిశీలనలో ఉన్నాయి. సాహోలో శ్రద్ధా కపూర్ కి.. రాధేశ్యామ్ లో పూజా హెగ్డేకి ఛాన్సిచ్చాడు డార్లింగ్. ఆ ఇద్దరూ ముంబై భామలే. ఈసారీ ఆప్షన్ బాలీవుడ్ కథానాయికకే. `పద్మావత్` దీపిక పదుకొనేకి అవకాశం ఇవ్వాలని ప్రభాస్ భావించారట. అంతేకాదు దీపిక అయితేనే తనకు సరిజోడు అని పట్టుపట్టి కూచున్నాడని వార్తలు వచ్చాయి. అందుకే నాగ్ అశ్విన్ తనని ఫైనల్ చేశారని తెలుస్తోంది.

అయితే దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్న ప్రాతిపదికన దీపిక పదుకొనే ఈ చిత్రానికి సంతకం చేయాలంటే తనకు భారీ పారితోషికం ముట్టజెప్పాల్సిందేనని పట్టుబట్టిందట. అందుకు మేకర్స్ ఓకే చెప్పడంతో దీపిక ఇప్పటికే డీల్ పై సంతకం చేసిందట. నేటి ఉదయం 11 గంటలకు ప్రభాస్ 21 కి సంబంధించిన అప్ డేట్ లో దీపికను కథానాయికగా ప్రకటించింది చిత్రబృందం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com