మరిన్ని విమాన సర్వీసులు నడపనున్న ఒమన్ ఎయిర్
- July 20, 2020
ఒమన్ ఎయిర్, మార్చి 28 నుంచి 30 జూన్ వరకు మొత్తం 61 ప్రత్యేక విమానాల్ని నడిపింది. విదేశాల్లో చిక్కుకుపోయిన ఒమన్ పౌరులు, రెసిడెంట్స్‌ని రప్పించడానికి.. అలాగే, ఒమన్‌లో చిక్కుకుపోయిన ఇతర దేశాలకు చెందినవారిని స్వదేశాలకు చేర్చడానికీ ఈ విమానాల్ని నడుపుతున్నారు. కాగా, ముందు ముందు మరిన్ని విమానాల్ని నడుపుతామని ఒమన్ ఎయిర్ వెల్లడించింది. కైరో, ప్యారిస్, బ్యాంకాక్, దుబాయ్ మరియు రియాద్‌లకు విమాన సర్వీసుల్ని ప్రత్యేక అవసరాల నిమిత్తం నడుపుతున్నారు. మస్కట్ నుంచి ఖసబ్ మధ్య మూడు వీక్లీ రౌండ్ ట్రిప్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని డెస్టినేషన్స్‌కి విమానాలు నడిపేందుకు సిద్ధంగా వున్నట్లు ఒమన్ ఎయిర్ పేర్కొంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







