మస్కట్: ఆర్వోపీ సెంటర్స్ లో వాహనాల ఫిట్నెస్ తనిఖీలు పున:ప్రారంభం
- July 21, 2020
కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన వాహనాల ఫిట్నెస్ టెస్టులు, సర్టిఫికెట్ల రెన్యూవల్ ప్రక్రియ పున:ప్రారంభం అయ్యాయి. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాయల్ ఓమన్ పోలీస్ సర్వీస్ సెంటర్లలో 10 ఏళ్ల మించి పాతబడిన వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఓమన్ లో పలు ప్రభుత్వ సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. గత మార్చి 21 నుంచి వాహనాల ఫిట్నెస్ పరీక్షలను కూడా నిలిపివేశారు. రెన్యూవల్ గడువు ముగిసిన వారికి కొద్ది రోజులు మినహాయింపు ఇచ్చారు. ఆన్ లైన్ ద్వారా రెన్యూవల్ చేశారు. అయితే..అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పలు రంగాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం..ఇక నుంచి వాహనాల ఫిట్నెస్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఓమన్ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం పదేళ్లకుపైబడిన వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించి వాహనాలకు మళ్లీ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. దీంతో దేశంలోని రాయల్ ఓమన్ పోలీస్ సర్వీస్ సెంటర్లలో వాహనాలకు ఫిట్నెస్ టెస్టులు విధిగా చేయించుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?