భారత్ నుంచి యూఏఈ వెళ్లే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టెస్ట్ అవసరం లేదు

- July 21, 2020 , by Maagulf
భారత్ నుంచి యూఏఈ వెళ్లే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టెస్ట్ అవసరం లేదు

భారత్ నుంచి యూఏఈ వెళ్లే వారికి ఆ దేశ ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పన్నెండేళ్లలోపు వారికి కోవిడ్ టెస్టులు అవసరం లేదని అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లుగా యూఏఈ వెళ్లే చిన్నారుల విషయంలో నెలకొన్న గందరగోళం తొలిగిపోయింది. ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన యూఏఈ ప్రభుత్వం..ప్రస్తుతం సవరించిన నిబంధనల మేరకు 12 ఏళ్లుపైబడిన వారికే కోవిడ్ టెస్టులు తప్పనిసరి అంటూ స్పష్టతనిచ్చింది. అయితే..ఈ విషయంలో ఏమైనా మార్పులు ఉంటే అధికారిక వెబ్ సైట్లలో వివరాలు వెల్లడిస్తామని కూడా తెలిపింది. ఇక 12 ఏళ్లపైబడిన వారికి మాత్రం భారత ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్ ల ద్వారా కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చింది. అది కూడా ప్రయాణానికి 96 గంటలలోపు టెస్ట్ ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. భారత్ నుంచి దుబాయ్, అబుధాబి, షార్జా వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ఫలితాలను సమర్పించాల్సి ఉంటుందని యూఏఈ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com