కేకుల రుచి చూపిస్తున్న 'మంచు' కోడలు
- July 21, 2020
హైదరాబాద్: బెస్పోక్ కేకులు లేదా కస్టమ్-మేడ్ డెజర్ట్‌ల విషయానికి వస్తే, వివరాలపై శ్రద్ధ చూపెడుతూ మనసుకి హద్దుకునేలా ఉండాలి. అలా వేడుకకు తగ్గట్టు కేకులను అందించటంలో అత్యంత ప్రాచుర్యం పొందిన డిజైనర్ డెజర్ట్ హౌస్‌లలో ఒకటైన 'ది కేక్ రూమ్'. నలుగురి బిడ్డలకు తల్లైన మరియు ప్రముఖ టాలీవుడ్ నటుడు విష్ణు మంచు భార్య విరానికా మంచు స్థాపించిన ఈ 'ది కేక్ రూమ్' నగరంలోని సీలెబ్రిటీలకు మరియు ప్రముఖులకు మాత్రమే కాకుండా సామాన్యప్రజలకు చేరువయింది.
“ఎనిమిది సంవత్సరాల క్రితం నా కవలలు పుట్టినప్పుడు నేను బేకింగ్ ప్రారంభించాను. నేను ఇంట్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను, అది మేము కుటుంబంగా చేసే పనిగా మారింది - విష్ణు, పిల్లలు మరియు నేను. మేము కేకులు మాత్రమే కాకుండా ఇంట్లో అన్ని రకాల గూడీస్ - కుకీలు, కేకులు కాల్చాము మరియు మేము డెజర్ట్స్‌తో ప్రయోగాలు చేస్తాము. మేము వీలైనంత తరచుగా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తాము. మీకు తెలుసా, నేను నా పిల్లల కోసం కేక్‌లను వారి ఇష్టమైన ఆకారాలలో చూస్తున్నప్పుడు, హైదరాబాద్‌లో అలాంటివి లేవని నేను గ్రహించాను. అందువల్ల, అలాంటిదే నేనే ప్రారంభించవచ్చని అనుకున్నాను.”అనివిరానికా చెప్పారు.
విరానికా మలిచిన కేకుల ముచ్చట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ లో చూడవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు