కల్తీ ఫ్యూయల్‌ అమ్మకం: పెట్రోల్‌ స్టేషన్‌ ఓనర్‌పై ‘నేమ్ - షేమ్’!

- July 24, 2020 , by Maagulf
కల్తీ ఫ్యూయల్‌ అమ్మకం: పెట్రోల్‌ స్టేషన్‌ ఓనర్‌పై ‘నేమ్ - షేమ్’!

రియాద్:సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌, ఓ పెట్రోల్‌ స్టేషన్‌ ఓనర్‌ అక్రమంగా కల్తీ ఫ్యూయల్‌ని విక్రయిస్తున్న నేపథ్యంలో ‘నేమ్ అండ్‌ షేమ్’ చర్యలు తీసుకుంది. రియాద్‌ క్రిమినల్‌ కోర్టు ఇచ్చిన తీర్పు తాలూకు సమ్మరీని మినిస్ట్రీ పబ్లిష్‌ చేసింది. నిందితుడిపై జరీమానా కూడా విధించారు. నెల రోజులపాటు ఆ పెట్రోల్‌ స్టేషన్‌ మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనకు సంబంధించి మినిస్ట్రీకి ఫిర్యాదు అందడంతో చర్యలకు శ్రీకారం చుట్టారు.అల్‌ జనాద్రియాహ్‌ ప్రాంతంలో ఈ పెట్రోల్‌ స్టేషన్‌ వుంది. 91 గ్యాసోలిన్‌కి సంబంధించి అక్రమాలు తేలడంతో, వాటిని పరిశీలించారు. వాటిల్లో డీజిల్‌ అలాగే వాటర్‌ని మిక్స్‌ చేసినట్లు గుర్తించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com