కువైట్ లో గుండెపోటుతో ఏ.పి వాసి మృతి
- July 25, 2020
కువైట్ సిటీ:ఆంధ్ర ప్రదేశ్,తూర్పు గోదావరి,రాజోలు మండలం,పొన్నమండ గ్రామం కు చెందిన వెంకట సత్యనారాయణ స్వామి సరెల్ల(80 )గుండె పోటుతో మరణించాడు.15 జులై, 20న ఉదయం మృతి చెందాడు.కువైట్ లో ఏడు ఏండ్ల నుండి పని చేస్తున్నాడు.రేపు 27 జూలై 2020 ఉదయం 2.45 కు హైదరాబాద్ చేరనుంది.
సరెల్ల సూర్య నారాయణ తన అన్న కుమారుడు కువైట్ లో అన్ని సంతకాలకు, పనులకు వెంట ఉంటున్నాడు.మోకా సారా గౌరీ మృతుని స్వస్థలం లో పొరుగు ఆమె, ప్రవీణ్ చింతలదానం గల్ఫ్ తెలంగాణ కార్మికుల సమితి అధ్యక్షుడు, మురళీధర్ రెడ్డి తెలుగు తెలంగాణ సంక్షేమ సంఘం తో కలిసి పనులలో వెంట ఉండి చక్క బెడుతున్నాడు. ఇండియన్ ఎంబసీ సానుకూలంగా స్పంచిందింది.
వెంకట్ మేడపాటి(APNRTS చైర్మన్), ఇలియాస్( డైరెక్టర్), మమ్మిడి బాల్ రెడ్డి(కువైట్ ఇంఛార్జి) ద్వారా ఎంబులన్స్ సహకారం అందింది.కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అతనికి చదువు లేనందువల్ల ఎటువంటి పని ఉండేదికాదు.కాబట్టి కువైట్ వెళ్లి జీవనోపాధి వెతుక్కున్నాడు ఇతనికి ఒక చిన్న రెండు గదుల ఇల్లు, పొలం ఏమిలేదు,తనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కుటుంబ సభ్యులు చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలను కూడా కల్పించడానికి, సంక్షేమ కార్యక్రమాలు వీరికి వర్తిస్తే ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆర్థిక స్థోమత లేని మృతదేహాలను ప్రభుత్వ ఖర్చుతో ఇంటికి పంపుతూ అంబులెన్సు నుండి దహన సంస్కారాలవరకు తోడ్పడే ఆలోచన చేయాలని ఎక్కువగా మన తెలుగు వారే కార్మికులుగా,స్వదేశం లో అవకాశాలు లేక విదేశాల లో పనులకు వెళ్లి అంతంత మాత్రమే సంపాదించారని.వీరిని ఆదుకోవాలని మురళీధర్ రెడ్డి గంగుల అభిప్రాయ పడ్డారు.
APNRTS లో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని ఆ సంస్థలో ఏ.పి రాష్ట్రానికి చెందిన వారు రిజిస్టర్ చేసుకోవాలని వారి నైపుణ్యత,విద్య,అనుభవం బట్టి వారికీ ఉపాధి అవకాశాలకు ఆ సంస్థ తోడ్పడుతుందని ఆ సంస్థ సూచించే విధంగా భీమా కూడా చేసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ఉపయోగకరం అని మురళీధర్ రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







