కరోనా నుంచి కోలుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు
- July 25, 2020
సావో పౌలో:రెండు వారాల చికిత్స అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా నుండి కోలుకున్నారు. శనివారం తన నివేదిక తిరిగి నెగెటివ్‌గా వచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గత పదిరోజులలో ఆయనకు మూడుసార్లు కరోనా పరీక్షలు చేశారు. అయితే మూడు నివేదికలు కూడా పాజిటివ్ అనే వచ్చాయి. బోల్సోనారో జూలై 7 న కరోనా యొక్క తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నానని ప్రకటించారు.
దాంతో అదేరోజు ఆయనకు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అప్పటినుంచి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా బ్రెజిల్ లో గత 24 గంటల్లో 55,891 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు 23,43,366 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం నమోదైన కేసుల్లో 15,90,264 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?