ట్యాక్సీలు రేపటి నుంచి ప్రారంభం: ఒకే ప్రయాణీకుడితో!

- July 27, 2020 , by Maagulf
ట్యాక్సీలు రేపటి నుంచి ప్రారంభం: ఒకే ప్రయాణీకుడితో!

కువైట్ సిటీ:కరోనా లాక్‌డౌన్‌ నుంచి ఉపశమన చర్యల్లో భాగంగా మూడో ఫేజ్‌లోకి ప్రవేశిస్తున్న దరిమిలా మరికొన్ని సడలింపులు ఇచ్చారు. జులై 28 మంగళవారం నుంచి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా నెలల తరబడి ఉపాధి కోల్పోయినవారికి ఇది ఊరటనిచ్చే అంశం. అయితే ట్యాక్సీలలో కేవలం ఒకే ప్రయాణీకుడికి అనుమతి వుంటుంది. ట్యాక్సీ డ్రైవర్‌కీ, ప్రయాణీకుడికి మధ్య ప్లాస్టిక్‌ తెర అడ్డంగా వుంటుంది. అయితే, భార్యాభర్తలిరువురూ వేర్వేరు ట్యాక్సీలలో వెళ్ళాలా.? అన్న విషయమై కొంత గందరగోళం వుంది. ఈ పరిస్థితిని ఎలా డీల్‌ చేయాలో అర్థం కావడంలేదని ఓ ట్యాక్సీ సంస్థ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com