20 దేశాలకు విమానాల రాకపోకలు

- July 29, 2020 , by Maagulf
20 దేశాలకు విమానాల రాకపోకలు

కువైట్ సిటీ:డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA), ఆగస్ట్‌ 1 నుండి కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 20 దేశాలకు విమాన రాకపోకల్ని పునరుద్ధరించనున్నట్లు పేర్కొంది. యూఏఈ, బహ్రెయిన్‌, ఒమన్‌, లెబనాన్‌, కతార్‌, జోర్డాన్‌, ఈజిప్ట్‌, మోస్నియా మరియు హెర్జెగోవినా, శ్రీలంక, పాకిస్తాన్‌, ఇది¸యోపియా, యునైటెడ్‌ కింగ్‌డమ్, టర్కీ, ఇరాన్‌, నేపాల్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, అజర్‌బైజాన్‌, ఫిలిప్పీన్స్‌ అలాగే ఇండియాకి విమాన సర్వీసులు నడవనున్నాయి. డిజిసిఎ డైరెక్టర్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అబ్దుల్లా అల్‌ రజి ఈ విషయాన్ని వెల్లడించారు. విమానాల షెడ్యూల్స్‌ త్వరలో వెల్లడి కానున్నట్లు ఆయన వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com