కెజిఎఫ్-2 నుంచి అధీరా లుక్ రిలీజ్

- July 29, 2020 , by Maagulf
కెజిఎఫ్-2 నుంచి అధీరా లుక్ రిలీజ్

కెజిఎఫ్ మూవీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కేజీఎఫ్ చాప్టర్ 2 విలన్ అధీరా ఫస్ట్ లుక్ విడుదలైంది. అత్యంత పాశవిక విలన్, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు. ఈ మూవీలో సంజయ్ దత్ అధీరా పాత్ర చేస్తున్నాడు. నేడు సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు మేకర్స్. కాగా కన్నడ యాంగ్రీయంగ్ మేన్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1  జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మాణ దశలో ఉంది. అక్టోబర్ లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com