మహిళను నిర్బంధించిన కేసులో నలుగురి అరెస్ట్‌

- July 29, 2020 , by Maagulf
మహిళను నిర్బంధించిన కేసులో నలుగురి అరెస్ట్‌

మనామా:ఇద్దరు బంగ్లాదేశీ పురుషులు, ఇద్దరు ఇండోనేసియన్‌ మహిళల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు ఓ ఇండోనేసియన్‌ మహిళను నిర్బంధించి, ఆమెతో వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హై క్రిమినల్‌ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. తాను పనిచేస్తోన్న స్పాన్సర్‌ నుంచి తప్పించుకుని, ఆ మహిళ మరో ఉద్యోగం కోసం చూస్తూ నిందితుల పంచన చేరినట్లు పోలీసులు పేర్కొన్నారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, నిందితులు ఆమెను బంధించినట్లు పోలీసులు వివరించారు. హారాలోని ఓ భవనంలో ఆమెను నిర్బంధించగా, పోలీసు అధికారులు ఆమెను రక్షించారు. ఆగస్ట్‌ 25న నిందితులపై తీర్పు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com