ఫ్లిప్ కార్ట్:బుక్ చేసిన గంటన్నరలో డెలివరీ

- July 29, 2020 , by Maagulf
ఫ్లిప్ కార్ట్:బుక్ చేసిన గంటన్నరలో డెలివరీ

బెంగుళూరు:ఫ్లిప్ కార్ట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వస్తువులను 90 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు ఫ్లిప్ కార్ట్ షాకిచ్చింది. ఇక నుంచి గ్రాసరీస్,హోమ్ యాక్ససిరీస్ లను కొనుగోలు చేస్తే కేవలం గంటన్నరలో అందిస్తామని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో ఈ హైపర్ లోకల్ సర్వీసులు ఆఫర్ చేయనుంది. రాబోయే రోజుల్లో మొబైల్ ఫోన్లను కూడా వేగంగా డెలివరీ చేస్తామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు బెంగుళూరులోని కొన్ని ప్రాంతాలల్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఇవి అమల్లోకి రానున్నాయి. గూగుల్‌కు చెందిన డుంజో, స్విగ్గీ కూడా భారత్‌లో గ్రాసరీ‌స్‌ను డెలివరీ చేస్తున్నాయి.

కరోనా వైరస్ ప్రభావంతో గ్రాసరీస్ ఆన్‌లైన్ డెలివరీకి ఫుల్ డిమాండ్ నెలకొంది. డిమాండ్ కు తగ్గట్టుగా కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. జియో మార్ట్ కు కూడా ఫ్లిప్ కార్టు ఝలకిచ్చిందని చెప్పవచ్చు. ఫ్లిప్ కార్టు ఒక అడుగు ముందుకు వేసి మొబైల్ ఫోన్లను కూడా వేగంగా అందిస్తామని ప్రకటించడంతో ఇతర కంపెనీలకు గట్టి షాకిచ్చినట్టైంది. ప్రస్తుతం గ్రాసరీస్ డెలివరీ చేస్తున్న కంపెనీలు కొన్ని గంటల సమయం తీసుకుంటున్నాయి. వాటికి షాకిచ్చేలా ఫ్లిప్ కార్ట్ కేవలం గంటన్నరలో వస్తువులు డెలివరీ చేస్తామని ప్రకటించింది.

Delivery within the booked hour and a half

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com