ఆఫీసును ఆస్పత్రిగా మార్చేసిన వ్యాపారవేత్త
- July 29, 2020
సూరత్ : కరోనా పాజిటివ్ బాధితుల పట్ల ఓ వ్యాపారవేత్త మానవత్వాన్ని చాటాడు. తన కార్యాలయాన్ని ఆస్పత్రిగా మార్చేశాడు. తను పడ్డ బాధ మరొకరు పడకూడదని, పేదలకు ఈ సౌకర్యం మరింత అండగా ఉంటుందని వ్యాపారవేత్త పేర్కొన్నాడు.
సూరత్‌కు చెందిన ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ అనే వ్యాపారవేత్తకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గత నెలలో సూరత్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. 20 రోజుల పాటు చికిత్స పొందినందుకు బిల్లును వేలల్లో వసూలు చేశారు. ఆయన వద్ద డబ్బు బోలేడు ఉన్నందుకు బిల్లు కట్టేశాడు. అదే సమయంలో పేదోళ్ల గురించి ఆలోచించాడు వ్యాపారవేత్త.
ఆస్పత్రి నుంచి బయటికొచ్చాక.. తన ఆఫీసును 85 పడకల ఆస్పత్రిగా మార్చేశాడు. దీంట్లో కులమతాలకు అతీతంగా పేదలకు మాత్రమే వైద్యం అందుతుందన్నాడు. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స ఖర్చు భారీగా ఉన్నది. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాను. కరోనా మహమ్మారి నిర్మూలనలో తాను కూడా భాగస్వామిని కావాలనుకున్నానని వ్యాపారవేత్త తెలిపాడు.
తన కార్యాలయంలో మొత్తం 85 పడకలను ఏర్పాటు చేశాడు. వైద్యులు, మెడిసిన్ అంతా ప్రభుత్వం ఇస్తుంది. మిగతావన్నీ తానే భరిస్తున్నట్లు వ్యాపారవేత్త కదర్ షేక్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?