హీరో రానా చేతుల మీదుగా లవ్ లైఫ్ అండ్ పకోడీ ట్రైలర్ విడుదల
- July 29, 2020
ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నో కమిట్ మెంట్స్, నో బుల్ షిట్స్, లెట్స్ కీపిట్ సింపుల్ అనేది వాళ్ల మాట. ప్రేమ కాదు, ఫ్రెండ్ షిప్ కాదు దాన్ని మించింది అంటూ ఈ బంధాలకు కొత్త పేర్లు పెడుతున్నారు యువత. నేటి ట్రెండ్ కు అద్దం పట్టే ఇలాంటి అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా లవ్ లైఫ్ అండ్ పకోడీ. బుధవారం ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న రానా, చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
యూత్ ట్రైండ్ పల్స్ పట్టుకున్నట్లుందీ ట్రైలర్. ఈ చిత్రంలో కార్తిక్ బిమల్ రెబ్బ , సంచిత పొనాచ, జంటగా నటించారు. కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై మధురా శ్రీధర్ రెడ్డి సమర్పణ లో దర్శకుడు జయంత్ గాలి లవ్ లైఫ్ అండ్ పకోడీ చిత్రాన్ని రూపొందించారు. హీరో హీరోయిన్లకిది తొలి చిత్రం. ఒక రిలేషన్ కి కమిట్అయ్యేందుకు కన ఫ్యూజ్ అయ్యే జంట కు వారి మద్య ప్రేమే సమస్యగా ఎలా మారుతుంది అనేది ఆసక్తిగా తెరమీదకు కనువిందు చేయబోతుంది. త్వరలో లవ్ లైఫ్ అండ్ పకోడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆకర్ష్ రాజ్ భాగవతుల, క్రిష్ణ హాబ్బల్, కళా జ్యోతి,అనురాధ మల్లికార్జున తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సాగర్ వైవివి జతిన్ మోహాన్, మ్యూజిక్:పవన్, ఎడిటర్:శ్రవన్ కటికనేని, ఆర్ట్:దండు రెంజీవ్,పి ఆర్ ఓ:జియస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:వెంకట సిద్దారెడ్డి, సమర్సణ:మధుర శ్రీధర్ రెడ్డి, నిర్మాత,రచన,దర్శకత్వం:జయంత్ గాలి
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?