తెలంగాణ:నూతన సెక్రటేరియట్ డిజైన్లను పరిశీలించిన కె.సి.ఆర్
- July 29, 2020
హైదరాబాద్:నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. వీటిలో పలు మార్పులను సూచించారు. సెక్రటేరియట్ లో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలుండేలా చూడాలని ఆదేశించారు.
కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎంఓ అధికారులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు, అధికారులు సతీష్,మధుసూదన్ రెడ్డి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆస్కార్-పొన్ని అర్కిటెక్స్ట్ నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొత్త సెక్రటేరియట్ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండాలని అన్నారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాలు, అన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం ఉండాలని సీఎం సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?