రాజమౌళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా
- July 29, 2020
హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలాగే, సమంత స్నేహితురాలు.. నటుడు సామ్రాట్ సోదరి శిల్పారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకున్నారు. పలువురు టీవీ తారలకు కరోనా సోకింది. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ‘బాహుబలి’ దర్శకుడు స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఫలితాలు ఈరోజు వచ్చాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు.
ప్రస్తుతం రాజమౌళి ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం షూటింగ్‌కు అనుమతులు ఇచ్చినా రాజమౌళి మాత్రం RRR షూటింగ్‌ను తిరిగి ప్రారంభించలేదు. దీనికి కారణం కరోనా మహమ్మారే. ఈ భయానక పరిస్థితుల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ వంటి స్టార్లతో పనిచేయడం కష్టమని భావించి ప్రస్తుతానికి షూటింగ్‌ను వాయిదా వేసుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







